ఉద్యమమే ఒక్క ముద్ర
తెలంగాణ ఉద్యమమే ఒక్క ముద్ర
ముద్రలెన్ని మారినా
ఉద్యమ ముద్ర మారునా?
ప్రపంచంలో
తెలంగాణ రాష్ట్ర సాధన ముద్ర
ప్రాణత్యాగాల ముద్ర
వీరుల ముద్ర, వీరయోధుల ముద్ర
సమరం సత్తువ సాధన
మార్పులెన్ని జరిగినా
మారని ముద్ర మరువని ముద్ర
నెత్తురొడిసిన ముద్ర
నేలన నిలిచిన ముద్ర
ఊరు జనం గుండెల్లో ఉన్న ముద్రే
పల్లె జన హృదయాల్లో పదిలమైన ముద్ర
పదేండ్ల పరిపాలన ముద్ర
నెత్తురు వడవని త్యాగం
నేలన నిలువని త్యాగం
త్యాగాలు లేని ముద్రలు
తాలు గింజల్లాంటివి
నెత్తుటి త్యాగాల మరకల ముద్ర
ఊరు ప్రజల రక్తం ఉడికిన ముద్ర
రాజ్యముద్రలెన్ని మారినా
రాష్ట్ర సాధన ముద్ర మారదుగా?
దేవరపాగ కృష్ణయ్య
99634 49579