‘పందిళ్ల శేఖర్‌బాబు స్మారక రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు-2025’ ఈ నెల 23 నుంచి 25వరకు హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఏటా ఇచ్చే పందిళ్ల శేఖర్‌బాబు స్మారక పురస్కారం-2025ను ప్రముఖ నటుడు, దర్శకుడు, బీఎం రెడ్డికి ఇవ్వనున్నారు. 23న ‘ఖరీదైన జైళ్లు’ నాటిక, సాయంత్రం 7.45 గంటలకు నవజ్యోతి కళామండలి జడ్చర్ల వారితో ‘మైరావణ’ పౌరాణిక పద్యనాటకం, 24న ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక, రాత్రి 7.45 గంటలకు ‘సుమిత్రా యూత్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా మధిర వారితో ‘కస్తూరి తిలకం’ 25న ‘మమ్మల్ని బతుకనివ్వండి’ నాటిక, రాత్రి 7.45 గంటలకు టీజీవీ కళాక్షేత్రం కర్నూల్ వారితో ‘జగదేకసుందరి సామా’ పద్య నాటకం ప్రదర్శించనున్నారు. నాటకరంగ అభిమానులందరికీ ఇదే ఆహ్వానం.
2025, సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలోని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో కవి బిల్ల మహేందర్ రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ పుస్తక పరిచయ సభ జరుగనున్నది. డాక్టర్ నామోజు బాలాచారి సభాధ్యక్షులుగా వ్యవహరించనున్నాliterature Newsరు. నెల్లుట్ల రమాదేవి పుస్తక పరిచయం చేయనుండగా, యాకూబ్, సంగిశెట్టి శ్రీవినాస్, సామిడి జగన్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
– తెలంగాణ సాహిత్య అకాడమీ
2025, సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిల్మ్ భవన్లో కవి పిన్నంశెట్టి రాసిన ‘నల్ల పద్యం’ కవితా సంపుటి పరిచయసభ జరుగనున్నది. సీవీ కుమార్ అధ్యక్షత వహించనుండగా, వక్తలుగా అన్నవరం దేవేందర్, పీఎస్ రవీంద్ర, డాక్టర్ రఘురామన్, పుప్పాల శ్రీరామ్ హాజరవుతారు.
– దామరకుంట శంకరయ్య, ప్రధాన కార్యదర్శి, తెరవే కరీంనగర్
2025, సెప్టెంబర్ 27న శనివారం నాడు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో జాలాది రత్న సుధీర్ రచించిన ‘కుమార్తెకు.. ప్రేమతో నాన్న’ పుస్తకావిష్కరణ సభ జరుగనున్నది. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సీఎస్ రాంబాబు, దినకర్ బాబు, పల్లవి, దేవనపల్లి వీణావాణి తదితరులు పాల్గొననున్నారు.
– గుడిపాటి, 98487 87284