“కొత్తగ చిగురు తొడిగిన తెలంగాణరా
విత్తన భాండాగారమై విలసిల్లేరా
వెలుగు నిండేరా బతుకు వెలుగు నిండేరా
ధాన్యరాశులన్ని ఇంట కొలువుదీరగా
తరతరాల గాయాలను తట్టుకుందిరా
ఇపుడు తల్లీ మాగాణమై మురిసిపోయేరా
ప్రతి గింజ విత్తనమై పంటచేలతో
పుడమికే ఇయ్యాల పురుడుపోసేరా
కల్లబొల్లి మాటలతో కపట ప్రేమతో
దగాపడ్డ నేల ఇపుడు వెలిగిపోయెరా
సొంత పాలనలోనా స్వరాష్ట్రంలోనా
విత్తన భాండాగారపు వేదికాయెరా
అంకాపూర్ నుండీ అది ఆరంభమయ్యి
రైతన్నకు ఊతమిచ్చే రైతు పాలనొచ్చెరా
ప్రతి జిల్లా పసిడి పంటల ప్రగతి బాటలు
పండ్లు కూరగాయలు పప్పుదినుసులు
ఆహారపంటలు వాణిజ్య పంటల విత్తనబీజo
అయ్యి వెలుగుతుoది చూడర మన తెలంగాణం
దేశ ప్రగతికేమో దిక్సూచి కాగా
భావి తరాలకు బతుకు బాట చూపేరా
ముప్పైమూడు జిల్లాలు ముందు నడవగా
బంగారు తెలంగాణ కల నిజమయేరా..!”
రామకృష్ణ మనిమద్దె
9494353828
గ్రాII మేళ్ళ దుప్పలపల్లి
జిల్లా & మం II నల్లగొండ
తెలంగాణ, ఇండియా.
PIN: 508004