దుక్కులన్ని రైతు దున్ని విత్తనమేయ!
పెట్టు బడియునంత పెట్టి పంట !!
వేయ డబ్బులేక వేసారి రైతన్న!
రైతుబంధు రక్ష రైతుకుండు!!
పొట్ట కొరకుకూలి పట్టణానికి పొతే!
కష్ట పెట్టి దోచు కపటులుండు!
కన్నవూరు లోనెవున్నదీ సుఖముర!
రైతుబంధు రక్ష రైతుకుండు!!
పంటపెట్టుబడికి పైస లేకను రైతు !
గోస పడ్డ రైతు గోడు తీరె!
పాడిపంటతోటి పల్లెల్ పరిఢవిల్ల!
రైతు బంధు రక్ష రైతుకుండు!!
సాగు లేని భూమి సాగులోనీ కొచ్చి!
ఎండినట్టి చెరువు నిండిపార!
పంట పండి రైతు యింట సిరులునిండె!
రైతుబంధు రక్ష రైతు కుండు!!
-కనకయ్య మల్లముల
94405 54042