కూడు గూడు గుడ్డలో గుడ్డను నేసే వాడు
బతకాలంటే కట్టే బట్టను తయారుచేసేవాడు
ఆరు గజాల చీర అందాన్ని అగ్గిపెట్టెలో ఇమిడ్చే వాడు
పోచంపల్లి , ఇక్కత్, తివాచీ, జీన్స్ బట్టేదయినా
పట్టు పురుగులనుంచి దారం తీసి నేసే పట్టువస్త్రమైనా
అప్పులు చేసి నూలును కొని మరమగ్గం తిప్పి
స్వదేశీ ఉద్యమ చిహ్నంగా పని చేసే కర్మశీలి నేతన్న!
అద్భుతాలను పరిచయం చేసే ఘనత నీదేనన్నా
నేత పని తప్ప మరేదీ చేయని
నీ చేతికోసం … చేనేత కోసం …
ఖాతా తెరిచి వాటా యిచ్చి
నీ బతుకుకు భరోసా ఇవ్వడం కోసం
మగ్గం తిప్పే మనిషి మరణిస్తే
ఆ కుటుంబానికి బాసటగా నిలబడడం కోసం
చేనేత కార్మికుని కళను ఒడిసి పట్టి
వారి జీవనగీతను మార్చి
తెలంగాణ ప్రభుత్వం నేతన్నకు ఇచ్చే నజరానా
నేతన్న చేయూత భీమా !
ఒడిశ్శా మంత్రి రీటా సాహూ వచ్చి మెచ్చి కితాబిచ్చిన పథకం!
ఓ నేతన్నా నీకోసం !
– డా. సమ్మెట విజయ
9989820215