మోడు వారిన నేల
మొలకలెత్తిన నేల
నీళ్లతో తెలంగాణ
నిండు గర్భిణి నేల
పల్లె నేల పచ్చని చీర
కట్టి పల్లె వడి పోసుకున్నది
పసుపు బియ్యం తోటి
పంట సిరులతోటి
గలగల పారే గంగ శబ్దాలు
నీరు లేని వాగు లేదు
నిండని చెరువు లేదు
చెరువులో చేపల
జలకళలు చూడు
జనం హృదయాలలో
జెండా ఎగురవేస్తుంది
రాష్ట్రమొచ్చినాక
సాగుతుంది సేద్దం
సంతోషాలతోటి
తెలంగాణ ఇంటింటా
ధాన్యరాశుల పంట
పథకాల తెలంగాణ
పని తీరు చూడాలి
కొత్త తెలంగాణ
కోరుకున్న జనం
-దేవరపాగ కృష్ణ, 99634 49579