ఉనికే ప్రశ్నార్థకమైన చోట రాళ్లను చీల్చుకొని ఎదగడమే సాహసం!
నీళ్లే కరువైన చోట
కన్నీళ్లు తాగి విస్తరించడమే
ఒక చరిత్ర!
ఇవ్వాళ
నా నీడ ఒక ఆకుపచ్చని జాడ
కాగితం మీద కట్టిన అక్షరాల మేడ!
ఎవరు
ఎదురుపడినా ఎగాదిగా చూసినా
ఒకింత గర్వం ఒకింత ఆనందం!
తల్లిలా ఆదరిస్తే
ఒకని కన్ను
నేను దాచుకున్న తేనె పట్టు పై!
నీడనిచ్చి ప్రేమిస్తే
మరొకని చేతిలో నూరిన గొడ్డలి
మొదటికే మోసం!
కవీ కాలం మారింది అనడం
అబద్ధం శుద్ధ అబద్ధం!!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261