అందరికీ నేను
షాయర్ గానే తెలుసు!
నా పేరు రాజూ!
ఆశారాజు!
అంటే.. రాజా హైదరాబాదీ!
నా వెనక చార్మినార్ అందముంది
మిత్రులు కలిసే చోట,ఇరానీ చాయ్ పొగల పరిమళం ఉన్నది
లీలగా మహా కవి ‘మఖ్దూమ్’ రాసిన
‘ఏక్ చమేలీ కే మండ్వే తలే’ పాట వినిపిస్తుంది
జైలు గోడల మీద చెరిగిపోని సంతకం,
‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’..
దారెంటా దాశరథి చెదిరిపోని స్వప్నం కనిపిస్తుంది
సారా శెహర్ ముఝే,
షాయర్ కే నామ్ సే జాన్ తా హై!
మై ‘పాగల్ షాయర్’ హూ!
ప్యార్ కర్ నే వాలా పాగల్ హూ!
ఆశారాజు
93923 02245