జాతీయస్థాయిలో గత పద్నాలుగేండ్లుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతిని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ యేడు కూడా ఇవ్వాలని సోమేపల్లి కుటుంబం నిర్ణయించింది. అత్యుత్తమ కథకు రూ.2,500, ఉత్తమ కథకు రూ.1,500, మంచి కథకు రూ.1,000, ప్రత్యేక బహుమతులు ఇద్దరికి రూ.500 ఇవ్వనున్నారు. హామీ పత్రంపై మాత్రమే రచయిత వివరాలు పేర్కొనాలి. కథలను ఆగస్టు 30వ తేదీ లోపు రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జేఈఆర్ కాంప్లెక్స్ రెండవ అంతస్థు, రజక వీధి, విజయవాడ-520001, సెల్: 9247475975 అనే చిరునామాకు పంపాలి.
– చలపాక ప్రకాశ్, వశిష్ట సోమేపల్లి
‘సైనికులు’ కథాంశంగా ఈ దీపావళికి వెలువడనున్న ‘సచింక’ కథా సంకలనంలో ప్రచురణ కోసం కథలను ఆహ్వానిస్తున్నాం. దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికుల పోరాట పటిమను, కర్తవ్యదీక్షను, త్యాగనిరతిని, దేశభక్తిని విభిన్న కోణాలలో ప్రతిబింబింపజేసే కథలు పంపాలి. మీ కథలను కస్తూరి మురళీకృష్ణ, ప్లాట్ నెం. 32, ఇంటి నెం.8-48, రఘురాంనగర్ కాలనీ, ఆదిత్య హాస్పిటల్ వీధి, దమ్మాయిగూడ, హైదరాబాద్-500083 అనే చిరునామాకు గానీ, 98496 17392 అనే నెంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ, sanchikastorycom pilation@ gmail.comకు ఇ-మెయిల్ ద్వారా కానీ పంపాలి. కథలు పంపాల్సిన చివరి తేదీ 2024, అక్టోబర్ 31.
– కస్తూరి మురళీకృష్ణ, కోడిహళ్ళి మురళీమోహన్
ప్రదానోత్సవ సభ
2024, జూలై 21 ఆదివారం రోజున ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కార్టూనిస్టు శేఖర్ మెమోరియల్ అవార్డు-2024’ ప్రదానోత్సవ సభ జరుగనున్నది. ఈ అవార్డును తెలంగాణ టుడే ఎడిటోరియల్ కార్టూనిస్టు పి.నర్సిం అందుకోనున్నారు. డాక్టర్ ఎస్.రఘు అధ్యక్షత వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు. శేఖర్ స్మారకోపన్యాసం ప్రసేన్ చేయనున్నారు. విశిష్ట అతిథులుగా విమలక్క, చలకాని వెంకట్ యాదవ్, ఆత్మీయ అతిథులుగా శంకర్ పామర్తి, కూరెళ్ళ శ్రీనివాస్, చంద్రకళా శేఖర్లు పాల్గొననున్నారు.
– నిర్వహణ: శేఖర్ మిత్రులు, కుటుంబసభ్యులు
2024, జూలై 16 మంగళవారం రోజు ఉదయం 11.00 గంటలకు ‘సిటీ కాలేజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ నేషనల్ అవార్డు ప్రదానోత్సవ సభ-2024’ హైదరాబాద్‌లోని ప్రభుత్వ సిటీ కళాశాల సమావేశ మందిరంలో జరుగనున్నది. సుప్రసిద్ధ కవి, విమర్శకులు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ ఈ అవార్డును స్వీకరించనున్నారు. సభాధ్యక్షులుగా ఆచార్య పి.బాల భాస్కర్ వ్యవహరించనుండగా, ముఖ్య అతిథిగా డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి హాజరుకానున్నారు. విశిష్ట అతిథిగా డాక్టర్ యాకూబ్, గౌరవ అతిథులుగా వాహెద్, డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్‌రావు పాల్గొననుండగా డాక్టర్ ఏలూరి యాదయ్య, డాక్టర్ జె.రత్నప్రభాకర్లు సమన్వయపరుస్తారు.
– డాక్టర్ విప్లవ్ దత్ శుక్లా, డాక్టర్ కోయి కోటేశ్వరరావు
ప్రకటన
‘సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ-వరంగల్’ ఆధ్వర్యంలో కీ.శే.ఒద్దిరాజు సోదర కవుల స్మృత్యకంగా ఏటా ‘సహృదయ సాహితీ పురస్కారం’ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాదికి గాను ‘కనిపించని శత్రువు’ నవల రాసిన మెట్టు మురళీధర్ ఎన్నికైనట్టు అధ్య క్షులు గన్నమరాజు గిరిజామనోహరబాబు, సాహిత్య కార్యదర్శి, మల్యాల మనోహరరావు, ప్రధాన కార్యదర్శి కుందావఝల కృష్ణమూర్తి తెలిపారు. ఈ పురస్కారాన్ని సహృదయ వార్షికోత్సవంలో అందించనున్నట్టు నిర్వా హకులు తెలిపారు.