నీవు కనిపించావు
నెల పొడుపు నాటి చంద్రునిలా
రేఖామాత్రం చిరునవ్వుతో..
నీ చిరునవ్వు
తదియ నాటి చంద్రునిలా
క్షణం మెరిసింది..
నీ నవ్వుల వెన్నెల
నవమి నాటి చంద్రునిలా
హాయిగా నా ఎద నింపింది
సిగ్గు దొంతరల
మేలి ముసుగులో
నీ దరహాసం నిండు పున్నమి
ఇక నా జీవితం వెన్నెల జల్లుల పండుగే..
సముద్రాల రంగాచార్యులు
92466 96095