అతిమాత్ర భాసురత్వం పుష్యతి భానోః పరిగ్రహాదనలః
అధిగచ్ఛతి మహిమానం చంద్రోపి నిశాపరిగృహీతః
సూర్యుని చేత ప్రభావితుడైన అగ్ని అతి వేడిని, ఎక్కువ కాంతిని ప్రసరింపజేయును. అదే సూర్యుని చేత ప్రభావితుడైన చంద్రుడు చల్లని కాంతిని, ఆహ్లాదాన్ని పంచుతాడు. వ్యక్తులకు ఆదర్శమైన వారు ఒకరే ఐనప్పటికీ అతని నుంచి గ్రహించేది విభిన్నంగా ఉంటున్నది. వారి స్వభావానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. ఆ క్రమంలో లోకోపకారం చేయువారు కొందరైతే, అందుకు భిన్నంగా నడుచుకునే వారు మరికొందరుంటారు. స్వభవాన్ని బట్టే వ్యక్తిత్వం, సచ్ఛీలత, సత్పవర్తన ఆధారపడి ఉంటుంది.
టి.సుధాకరశర్మ