జీవితం బాక్సింగ్ బరిలో పోరాటం
పడగానే ఓడిపోయావని కాదు
పడి లేవకపోతే ఓటమి!
ఇనుము కొలిమిలో కాలి
సమ్మెట దెబ్బలు తింటేనే
కత్తి అవుతుంది!
కాళ్ళు ఎంతో కసరత్తు చేస్తేనే
అడుగులు వరుసకట్టి
బాట పడుతుంది!
అలుపు లేకుండా
పోరాటం చేస్తేనే
గెలుపు తలుపు తడుతుంది!
జీవితమంతా రణం
ఆగకుండా చేయాలి
చివరికి మ‘రణం’లోనూ!
-జగ్గయ్య.జి
98495 25802