ఎక్కడ పడిపోతానేమోనని
పనిగట్టుకొని పసిగడుతూనే ఉంది
వేగానికి ముందు నోరు తెరచి
నిర్లక్ష్యం వెనుక చేతులు ఆనించి
కుడి ఎడమల కుదుపుల మాటున
ఒడి కాచుక్కూచుంది
నిత్య సేద్యపు జీవితపు పొలంలో
జారుడు బల్లంటి కాలం గట్ల మీద
వేసిన అడుగు, తీసిన పొడుగునా
మనసును సతాయిస్తున్న భయమే
నేలపై నూకలు మిగిల్చిన
జీవన సంజీవనయ్యిందేమో!
భయమే భద్రత!
చావంటే భయం కాదు
బ్రతుకంటే చావడమూ కాదు
ఎప్పటికైనా, తప్పనిదే అయినా..
మృత్యువే ఎదురొస్తే
వెళ్ళి కౌగిలించుకుంటామా?
-వినోద్ కుత్తం
96343 14502