ఒంటిపై పచ్చబొట్లు
మెడలో తాయెత్తు
దారుఢ్య ఉక్కు శరీరం!
తూటాల రక్తంతో
అభిషేకమైనట్టు ఆపాదమస్తకం!
నిర్దోషి ఆదివాసి శవం!!
ఈ శవానికి సంబంధించిన వారు
ఎవరైన వచ్చి వంద ప్రశ్నలకు
సమాధానాలు చెప్పి
వారి ఆచారాల ప్రకారం
అంత్యక్రియలు
జరుపుకోవచ్చును!!
గుర్తింపబడని ఈ అడవిలోని శవాన్ని
ఎవరూ గుర్తించడానికి
రావడం లేదు
భయంతో ఎవరు వస్తారు!
ఎవరూ ఎరుకపట్టకున్నా!
పార్థివ శరీరాన్ని పంచభూతాలు
గుర్తుపట్టాయి మరి!
ఇక తమలో నిరభ్యంతరంగా
కలిపేసుకుంటాయి
ఏ అడ్డూ లేదు!!
గుర్తింపబడని శవం అనాథ అయినా
ప్రపంచానికి చరిత్రగా కావాల్సిందేకందాళై
-రాఘవాచార్య
8790593638
కథల పోటీ
చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్, బాలచెలిమి సంపాదకులు మణికొండ వేదకుమార్ సారథ్యంలో, 2025, నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో బాలచెలిమి కథల పోటీలు జరుగనున్నాయి. పిల్లల కోసం పిల్లలు, పెద్దలు రాసిన కథలను పంపవచ్చు. పోటీలో ఎంపికైన కథలు బాల చెలిమి పత్రికలో అచ్చవడమే కాకుండా, సంకలనంగానూ వస్తాయి. కథలు పంపాల్సిన ఆఖరి తేదీ 2025, సెప్టెంబర్ 20. కథలు పంపవలసిన చిరునామా: బాల చెలిమి కథల పోటీ, ‘భూపతి సదన్’, ఇ.నం.3-6-716, స్ట్రీట్ నెం.12, హిమాయత్ నగర్, హైదరాబాద్-029, తెలంగాణ.
– గరిపెల్లి అశోక్,
9849649101