కొత్త సంవత్సరం!
కొత్త ఎజెండా!
సరికొత్త జెండా!
కొత్త సంవత్సరం దేశ స్పృహతో
పగలూ రాత్రీ తేడా లేకుండా
రైతు భావనతో
ఉత్సవం చేసుకోవాల్సిందే…
అంతా కొత్త ఎజెండా!
కరువును ఖండించే రైతు నాగలిని మించిన
ప్రజా ఆయుధమేముంది!
కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకూ
నాగలి నడకగా కొత్త ఎజెండా
ఆచరణగా లిఖించుకోవాల్సిందే!
ఏ కాలమైనా.. ఏ శాసనమైనా..
దేశంలో శాపం కారాదు!
శాసనమంటే రక్షించేది!
పిడికెడు అన్నం పెట్టే వ్యవసాయానికి
సహాయం అందించేది!
సరికొత్త జెండా వాడ వాడ
ప్రతి రాష్ట్రంలో
దేశమంతటా ఎగరాల్సిందే!
జెండాను చూస్తే మనదేశం ఆత్మలాగే
ఏకంగా అనిపించాలి!
విడగొట్టినట్లు విలయంగా ఉండరాదు
కొత్త సంవత్సరం డైరీలో కొత్త ఎజెండా
దేశంలో ప్రతి చౌరస్తాలో
కొత్త జెండా పండుగ!
రైతును ప్రేమించేవాడే అధినాయకుడైతే
మట్టికి కావల్సిందేముంది!
ముట్టిందల్లా బంగారమవుతుంది!
సస్యశ్యామలాం మాతరం!
కందాళై ,రాఘవాచార్య
87905 93638