పాటలకందని వాడు– సాయిచంద్
మాటలకందని వాడు– సాయిచంద్
పాటల మూటెత్తుకొని– సాయిచంద్
పల్లెలు సుట్టొచ్చినాడు– సాయిచంద్
ఉద్యమ జెండైనాడు– సాయిచంద్
పాటకూపిరైనోడు– సాయిచంద్ (పాట)
తెలంగాణ ఉద్యమాల్లో పొలికేకై బొబ్బపెట్టి
లక్షలాది జనాలకు లక్ష్యాన్ని చూపెట్టి
బిగిపిడికిలి జెండెత్తి విప్లవ పాటలు పాడి
పాటమ్మకు హారతిచ్చి అగ్గిని రాజేసినోడు
కణకణమని డప్పుకొట్టి– సాయిచంద్
పాటయుద్ధం పుట్టించె– సాయిచంద్
లాఠీలకు ఎదురుబడి– సాయిచంద్
లావుపాటలు పాడినాడె– సాయిచంద్
ఉక్కు నరాలు బిగపట్టీ పాటకూపిరి పోసినోడు
కాలందెలు మోగించి కవాతులు తొక్కినోడు
అమరవీరుల ఆశయాలు శరబోధన చేసినోడు
మట్టికోసం మరణాన్ని పాటతో ముద్దాడినోడు
ఇంటింటికి మేలుకొలుపై– సాయిచంద్
నీ పాట సుప్రభాతమాయె– సాయిచంద్
నీ ఆటపాటలు లేకుండా– సాయిచంద్
రాష్ట్రం ఊహించలేము– సాయిచంద్ (పాట)
రామారావు నాగన్నల రాగమాలపించి
గద్దర్ గర్జనల గొంతును పలికించి
గోరటి జయరాజోలే పాటలు రచియించి
గూడంజన్నల ఊరు గోడునాలపించి
తండ్రి వెంకట్రాముల– సాయిచంద్
పాటలుగ్గుపాలు తాగి– సాయిచంద్
మిట్టపల్లి యశ్పాల్ పాటతో– సాయిచంద్
మెరుపులాగ మెరిసినాడు– సాయిచంద్ (పాట)
నీ గొంతు వినీ చెట్టుసేమ ఊగి ఆడెనే
నీ ఆట చూసి లేగదూడ సెంగునెగిరెను
నిన్నుగనీ తెలంగాణ గర్వమొందెలే
వెయేండ్లయిన నీలాంటోడు పుట్టబొడులే
నీవిడిసిన ఆశ్వాస సాయిచంద్
పూల వనాలై పూసును సాయిచంద్
నీవెత్తిన ఆ గొంతుక సాయిచంద్
కోట్ల గొంతులై గర్జించును సాయిచంద్
(పాట)
యశ్పాల్