గుడ్డిదీపం కిందున్న తెలంగాణను
గులాబీ జెండవట్టి ఎలుగు తెచ్చిండు మా సారు..
నాడు సర్కారు కొలువులల్ల నడివంత్రపోల్లచ్చి కూకుంటే
తెలంగాణ ఎన్నుపూస ఇర్గినట్లుండేది..
నలుగురు కూడి తెలంగాణను బంతినిజేసి
ఆడుకుంట అందినకాడికి నాక్కుంటాంటే
తెలంగాణ బొండిగవిస్కి మూలకు ఏసినట్లనిపించేది..
ఆడిబిడ్డల మంచినీళ్ళ గోసలు
ఉప్పునీళ్ల బాయిల బొక్కెనోలే మునుగుతాంటే
తెలంగాణ కండ్లు దుఃఖం వరదలో ఈదేవి…
రైతన్నల బొత్త మీద కారే సెమట సుక్కలు చూస్తే
తెలంగాణ పొలాలన్ని ముండమోసినట్లే ఉండేవి…
ముసలవ్వకు ఆసరా లేక అడుక్కుంటాంటే
తెలంగాణ తల్లి గొడ్రాలోలే కనిపించేది..
దిగుట్ల సిల్లర పైసలు కరువై..
మూలకున్న ముంతల సుక్క నీళ్ళబొట్టు లేకుండే….
తిన్నన్నం పెయ్యికి వట్టలేదు మా కేసీఆర్ సారుకు….
కంటినిండా నిద్రలేక కండ్లు జాగారం సేయవట్టే….
కరెంటు లేక నీళ్లందక పసిపిల్లలు పాలకేడ్చినట్లు
పంటలన్నీ నోరుతెర్చి సూసేవి…
ఇక నేను సచ్చుడా తెలంగాణ అచ్చుడా
అని మా కేసీఆర్ సారు గల్మదాటిండు….
తనెన్క ఎంత మందున్నరని మర్రి సూడకుండ..
తొవ్వలున్న ముండ్ల కంపల్ని ఏరిపారేసుకుంట..
పదవులన్ని గాల్లో ఇసిరేసి తనొక
కొర్రాయిలా మారి ఉద్యమాన్ని చేసి..
జలదృశ్యం నుంచి సుజల దృశ్యం దాటి..
ఇయ్యాల సాగర నడిఒడ్డున
అమరవీరులకు ఆరిపోని దీపాన్ని పెట్టిండు..
అవమానాల లెక్కలను నెమరేసుకుంటూనే
అంబేద్కర్ నిలువెత్తు రూపాన్ని చెక్కించిండు…
సచివాలయాన్ని చరిత్రలో నిలిచిపోయేట్లు కట్టించిండు
తెలంగాణత్తే ఏమత్తదన్న నోర్లల్ని
ఇయ్యాల ముక్కుమీద ఏలేసుకునేట్లు సేసిండు….
మగల పుట్టి పుబ్బల పోతదని ఎక్కిరిచ్చినోల్లే..
ఆత్మగౌరవ కండువా కప్పుకొని తిరుగుతాండ్రు…
కేసీఆర్ సారు పాలనలో నేడు ఇంటింటికీ
పథకాలన్ని ఇస్తార్ల వడ్డిస్తాంటే..
రేపు బీఆర్ఎస్తో దూసుకెల్లి సుపరిపాలన చేసే
నాయకత్వం మా కేసీఆర్ సారుదే..
గులాబీ జెండాతో సానవెట్టిన తెలంగాణల
అభివృద్ధి ఆకాశాన్ని అంటుడే దప్ప
ఇక మాశిపోవుడంటూ ఉండది..
తుమ్మల , కల్పనారెడ్డి
96404 62142