మన ఇద్దరి పొందు కోసం
ముందులాగనే పడమరకు కుంగి
సాయం చేసి సైగచేసిన భానుడు
ఓ సాయంత్రం
మబ్బుతునక విరిగి రాలినట్టుగా
తుంపర తుంపరగా కురుస్తున్న తొలిమంచు
ఇరువురి కలయికను తొందర చేస్తున్న శీతగాలులు
మన ఏకాంత గుసగుసలు వినడానికి
కీచురాళ్లు కిక్కురుమనకుండా ఉన్నవి
నీ నిశబ్దం ఇద్దరి ఆశలపై నీళ్లు చల్లింది
మొగలిపొదల మాటున
పెనవేసుకున్న స్వర్పాల జంట
సాటుగా మన సరసాన్ని చూడా
నిచేష్టమై నిలబడి చూస్తున్నాయి
నువ్వేమో సిగ్గుతో దూరం దూరం
మోహపు తీపి బాధతో మూడు హృదయాలు
పున్నమసొంటి నీ నవ్వు కోసం నేను ఆకాశం..
వేచి వేచి కనులు మూసి ఓ దీర్ఘాలోచన
పక్కుమన్న నీ నవ్వు శబ్దం
మిలమిలా వెలిగే నాలుగు కళ్లు
ఏ వేకువనో ప్రకృతికి ప్రేమ వసంతం
వెయ్యి కండ్లతో వేచి చూస్తున్న పంచభూతాలు…
-దివి