బాబర్ అక్బర్ కన్పించినంత ‘క్లోజప్’గా
అన్నదాతలు అస్సలు కన్పడరు
పాకిస్థాన్ జగడాలపై ఉన్నంత ప్రేమ
కిసాన్లపై ఎందుకుంటుంది
రాముడుంటే సరి.. రైతులెందుకు?!
రైతు.. వొట్టి అన్నమే పెట్టిండు
రాముడు.. రాజ్యాధికారాన్నిచ్చిండు
రైతుల్లేకుండా రాముడు రాజెట్లయిండు
రైతుకన్న రాముడే మిన్ననా!?
నాగలినే నమ్మినోళ్లు
మట్టిలో గింజల్ని మొలిపించడం తప్ప
నాలుకల్ని గోడలకు అతికియ్యలేనోళ్లు
కర్షకులు.. రక్షకులు!
ట్రాక్టర్ల కింద నలిగిపోయి
మడికట్లో వరిగొలుసులై పూసినోళ్లు
మట్టిని నువ్వెంత ద్వేషించినా
రైతు నాటిన విత్తనాలను మొలకెత్తిస్తుంది
రైతుల్ని రాజులు నాశనం చేసినా
కంకులై మొలకెత్తి రాజ్యానికి అన్నం పెడ్తరు
పార్టీలవి.. మాటల కొట్లాటలు
రైతులవి.. కూటి కోసం కొట్లాటలు
రైతు.. రాముడైండో లేదో గానీ
రైతులు.. రోజూ క్రీస్తులైతున్నరు…
వనపట్లసుబ్బయ్య
94927 65358హై