ఖమ్మం ఈస్తటిక్స్ సాహిత్య పురస్కారాలను ప్రకటించారు. కవిత్వం విభాగంలో పలమనేరు బాలాజీ కవితా సంపుటి ‘లోపలేదో కదులుతున్నట్టు’ రూ.40 వేల బహుమతిని గెలుచుకుంది. రేణుక అయోల కవితా సంపుటి ‘రవిక’, పాయల మురళీకృష్ణ ‘గచ్చం చెట్టుకు అటూ ఇటూ’ ప్రత్యేక ప్రశంసకు ఎంపికయ్యాయి. కథల విభాగంలో ఉత్తమ కథగా వి.ఆర్ రాసాని ‘తేనెకల్లు’ రూ.25 వేలు గెలుచుకుంది. ద్వితీయ ఉత్తమ కథగా ఆలూరి అరుణ్ కుమార్ ‘అంజమ్మ’ రూ.15 వేలు, తృతీయ ఉత్తమ కథగా యాములపల్లి నర్సిరెడ్డి ‘కావలి’ రూ.10 వేలు గెలుచుకున్నాయి.
బహుమతులు గెలుచుకున్న కథలతో సహా మరో పన్నెండు కథలను కలిపి ఒక సంపుటిగా ప్రచురించాలని ఖమ్మం ఈస్తటిక్స్ కమిటీ నిర్ణయించింది. ఎం.సుగుణాకరరావు ‘అప్పో దీపోభవ’, సుంకోజు దేవేంద్రాచారి ‘శివుడాజ్ఞ’, ఎం.ప్రగతి ‘ఉంకువ’, సంజయ్ ఖాన్ ‘మూడో కన్ను’, గౌతమ్ లింగా ‘నల్లమల్లె చెట్టు’, జి.వి.శ్రీనివాస్ ‘నేలరాలిన పువ్వు’, బి.కళాగోపాల్ ‘ఇష అసంతం’, గుమ్మడి రవీంద్రనాథ్ ‘అనగనగా ఒక హంస’, ఆర్వీ రమణ శాస్త్రి ‘అసూయ’ కథలు సాధారణ ప్రచురణకు ఎంపికయ్యాయి. నవంబర్ 9న ఖమ్మంలో జరిగే అవార్డుల ప్రదాన కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతితో పాటు షీల్డ్ అందించనున్నారు.
– రవి మారుత్, ఖమ్మం ఈస్తటిక్స్