చూపు..!!
పూలు పూసినంత పరిమళంగా చూపుండాలి నది ఉజ్వల ప్రవాహమంత చూపుండాలి విత్తనం మొలకెత్తినంత కాంతివంతంగా కళ్ళుండాలి
పూలు పూసినంత
పరిమళంగా చూపుండాలి
నది ఉజ్వల ప్రవాహమంత చూపుండాలి
విత్తనం మొలకెత్తినంత
కాంతివంతంగా కళ్ళుండాలి
మానవీయ ఆలోచనేదైనా
మానవత మమతలు పూస్తది
అవ్వ తాత అమ్మ నాయినల
మంచి కంటి చూపుకై
పల్లెవాకిట్లకే కంటివెలుగు
నాగలి సాలుతోలే కను చూపుండాలి
తడిదుక్కిలో గొర్రు వెంబడి జొన్నగింజలేసే చూపుండాలి
ఆకాశమెత్తు తాళ్ళెక్కి కల్లుగీసే
దూరపు చూపుండాలి
సారెపై మట్టిముద్దను తిప్పి
కూరాడు కుండనుచేసె చూపుండాలి
కావ్యాన్ని ఆస్వాదించె చూపుండాలి
చూపులేని నడక బీడువారిన బండనే !
చెరువులో అలల కోలాటాన్ని చూసే చూపుండాలి
వరిగొలుసుల మీద వాలిన పిచ్చుకల చూసే చూపుండాలి
చంకన బిడ్డతో ఈతచాపల్లుతూ
సంతలో భిక్షాటన చేస్తున్న పేదరికాన్ని చూసే చూపుండాలి
ఏ రాత్రైనా వేల మందలో
తన సుక్కమేకను గుర్తించె చూపుండాలి
కుటుంబాన్ని నడిపించే
చూపుడు వేలు చూపుండాలి.!
ఆస్తి అంతస్థుల అనుభవించే చూపుండాలి
ఊరు కష్టసుఖాలు పంచుకోనే చూపుండాలి
గూటిలో గువ్వగుడ్డును చూసె చూపుండాలి
కాలం అవరోధాల్ని చూసే
దుర్భిణి లాంటి చూపుండాలి
మసక మసక చూపులొద్దు
ఏకలవ్యుడి గురికి ఎదురులేని ధనుస్సు చూపుండాలి
మత్స్యయంత్రాన్ని ఛేదించే అర్జునుడి చూపుండాలి
మనిషికి గుండె, కళ్లు ప్రధానం
అమ్మ నాయినిచ్చిన అపురూప కానుకలు
అంధత్వం అంగవైకల్యం
నేల గుండెకు పుండ్లు
రాత్రి పగలు ఒక రంగు
చెట్టు, చేవం ఒక రంగు
చామంతి మందారం ఒక రంగు
పుట్ట, బుట్ట ఒక రంగు
కుంకుమ, కాటుక ఒక రంగు
ప్రకృతి,వికృతి ఒక రంగు
రంగు రంగులను చూడాలంటే
వెలుగు అవసరం
కంటికి వెలుగవసరం
కంటివెలుగు
కోటిమందికీ వెలుగు
వెలుగొక్కటి కాదు
కోట్ల కంటి వెలుగులు
పొలాల్లో పంటల సింగిడీలు
గంగపుత్రుల గుండెల్లో జలపుష్పాల కేకలు
చేనేతల చేతుల్లో బతుకమ్మ సందడులు
సంక్రాంతి రంగుల ముగ్గుల్లా
సూర్యుడు కోటి రంగుల పంట
ఆ సూర్యుడే కేసీఆర్
-వనపట్ల సుబ్బయ్య
9492765358
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

