వీరుడి చిరునవ్వు
భూమి స్వేదాన్ని గాక రక్తాన్ని స్రవిస్తున్నప్పుడు ప్రేమ ఫలాలు పండవు నేల శిశువుల్ని గాక శవాల్ని ప్రసవిస్తున్నప్పుడుఊయల పాటలుండవు గెలిచేది ఏ దేశమైనాఒరిగేది అతడి దేహమే!పోరాడేది అగ్రరాజ్యమైనా ఉగ్రరాజ్యమైనా ఒరిగేది వాణిజ్య ప్రయోజనమే మంచుకొండల్లో మంటలు రేపిన చక్రవర్తీ!
వేల గుండెల మంటలార్పలేని వక్రవర్తీ! నీ కంటి ఎర్ర జీర తగ్గడం కోసం అతడి రక్తం ఏరులై పారింది నీ చమురు భూగోళమంతా మండటం కోసం అతడి ఇంటిదీపమారిపోయి తలాపున వెలిగింది నీ రాతి కోట మీద ఎగురుతున్న జెండాయే అతడి ఛాతీ గోడమీద ఒదిగి పరుచుకుంది బాంబులతో కలుషితమైన గంధకపు గాలిఅతడి ఆఖరి ఊపిరి పీల్చి గంధమైంది ఓ పతనుడి అభినందన బొకేలోనికో మరో పుతినుడి కోటు జేబుకో చేరడం కన్నా ఓ పునీతుడి ఎదపై వాలి తరించాలనుకుంది గులాబీఅంతు తెలియని ఆకాశ ద్వారానికిరేపు నువ్వూ చేరుకున్నప్పుడుముందువరుసలో నిల్చున్న అతడుశాంతిగా ప్రేమగా నీ వంక చూసి నవ్వుతాడు అది వీరుడి చిరునవ్వు!!
-నెల్లుట్ల రమాదేవి 94406 22781
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

