గుడిలో దేవుడు
గుడిసెలో జీవుడు
దేవునికి నైవేద్యం
జీవునికి పథ్యం
అన్న రాశులు అక్కడ
ఆకలి గోసలు ఇక్కడ
దేవుళ్లకు కల్యాణాలు
కాషాయ వేషాలు
పీఠాలు పటాటోపాలు
గుడుంబా గురువులు
నాయకుల అండదండాలు
హిరణ్యాక్ష అకృత్యాలు
సన్యాసులు సమ్మోహన విన్యాసాలు
దక్షిణల స్వీకరణలు
తా యెత్తులు ఎత్తులు కుయుక్తులు
దేవుడున్నాడా? ఇదో సందేహ ప్రేతం
ఆస్తిక నాస్తిక వాదోపవాదాలు
మాధ్యమాల్లో చర్చలు ప్రసారాలు
సందేహ నివృత్తులు సశేషం
ధర్మోరక్షతి…
– సోమయాజుల సుబ్రహ్మణ్య శర్మ 93466 71524