అతనొక కలకన్నాడు ఎన్నో గాయపడిన గుండెలలో ఉద్భవించిన ప్రశ్నలకు సమాధానం ఆ కల
పల్లె పల్లెన ప్రజ్వలించి ప్రతి మనిషిలో జ్ఞాన దీపమై రాష్ట్ర సాధన స్ఫూర్తి నింపి జాతిని ఏకం చేసిన చైతన్యమతడు
ఎదురు గాలులుఎన్ని వీచినా ఉద్యమ దీపం ఆరిపోకుండా అరి చేతులు అడ్డం పెట్టి కాచుకున్నవాడు
ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ కావ్యానికి ముందు మాట అతడు..
పెద్ద కొడుకై తెలంగాణ వాదాన్ని భుజాల మీద మోస్తూ తల్లడిల్లిపోతున్న బిడ్డల తలరాతలు మార్చి రారాజుల చేస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసెనతడు
సమైక్యాంధ్ర వేటగాళ్లవలలో చిక్కిన పావురాళ్ళకు విముక్తి గీతం అతడు ఆకలి మంటల గుండెలపై చెరగని ఆకుపచ్చని చిరునవ్వు అతడు అర్ధరాత్రి చెరువు అలుగు దుంకిన ప్రవాహ భేరి అతడు
బీడు వారిన పొలాల్లో చిగురించిన ఆశల హరిత గీతమతడు పాఠాలు నేర్పడమే కాదు సత్యాన్ని బోధించి సంఘటిత పరిచి పోరాట దారిని చూపిన పొద్దు అతడు
గొంతులో కత్తులు కోలాటమాడుతున్నా సింహకంఠనాదమై ప్రతి హృదయంలో గర్జించిన ఆత్మగౌరవ పతాకమతడు
దశాబ్ది పథంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న బంగారు తెలంగాణ ముఖ చిత్రమతడు
– చిక్కొండ్ర రవి 9502378992