రాజన్నా.. ఎనిమిదేండ్ల కింద ఎట్లుండెనే బతుకులు
బీడుబారిన భూములు.. నోళ్లు తెరిసిన నేలలు
రాష్ట్రమొచ్చినాక కాళేశ్వరం జలధారలు
పాల పొంగులై.. రైతన్న సేనులో సెలకలో పారుతూ
తెల్లని పత్తి పువ్వులై పూస్తున్నయి!
ఏండ్ల సంది కడుపులో పూడికను నింపుకొన్న
చెరువులన్నీ.. నేడు నీటితో నిండి జలకళతో
తామర పువ్వులతో సింగారించుకుంటున్నయి
కాలువల్లో కొలనుల్లో పిల్లల ఈతల సరదాలు
ఇపుడు తెలంగాణ పల్లెపల్లెన కనువిందులు..
నర్సన్నా.. ఎవడు పట్టించుకున్నడే రైతన్నను
నాడు సాగుకు సాయం లేక కన్నీటి పాటయ్యిండు
నేడు రైతుబంధుతో హాలికుడు..
హరివిల్లుల పంటలు పండిస్తున్నడు
చిల్లులు పడ్డ జీవితానికి చిల్లరగవ్వ లేనిది నాడు
ధాన్యరాసులతో ధనరాసులయ్యేను నేడు..
నింగిలోని సుక్కలన్నీ వెండి తారలై మెరిసినట్లు
సేద్యకాడి మోములో చిరునవ్వుల సవ్వడి
తెలంగాణ నేలంతా పచ్చని పంటల పందిరి…
గంగన్నా.. కులవృత్తుల కన్నీరును తుడిచిందెవ్వరే
చేతివృతులన్ని చెదలు పెట్టెను నాడు
ఆత్మగౌరవంతో అభివృద్ధి చెందుతున్నయి నేడు..
లస్మవ్వా.. నాడు పల్లెలన్నీ ఎట్లుండే కదనే
పచ్చని చెట్లతో ప్రకృతి పల్లె వనాలతో
ఆకుపచ్చ చీర కట్టినట్లు దర్శమిస్తున్నాయి నేడు..
స్వచ్ఛతకు మారుపేరై మెరిసిపోతున్నయి నేడు..
– అశోక్ గోనె, 94413 17361