మేఘాల సమూహం
నక్షత్రాల వాకిళ్లు
అందమైన చందమామ
కురిసే వెన్నెల జల్లులు!!
ఆశావాదికి అందుకోవాలనే అంత
నిరాశావాదికి అంతులేనంత!
మనసున్నవాడికి హృదయంత
హృదయం లేనివాడికి శూన్యమే అంతా!!
నీలిరంగును నీటికిచ్చి
తన ఎత్తును సముద్రపు లోతుకిచ్చింది!
ముసిరిన మేఘాలను ముద్దాడి
మిరుమిట్లు గొలిపే మెరుపులనిస్తుంది!!
తన నుంచి రాలే నీటిచుక్క
సూర్యుడితో ప్రేమలో పడి
ఇంద్రధనస్సులను ప్రసవిస్తుంది!
నేలపట్ల హర్షాన్ని వర్షంగా కురుస్తుంది!!
అమావాస్య పౌర్ణమిలు
రాత్రి పగలుగా
అనునిత్యం
సూర్య చంద్రులతో
వెలుగుల్ని ఇస్తుంది!!
హద్దులు లేని ఆనందం ఆకాశం!
అందమైన పొద్దుపొడుపు ఆకాశం!!
జి.జగ్గయ్య
98495 25802