హలం పట్టి రైతు పొలం దున్ని
ఆరవోసిన ధాన్యం
ఆకలి తీర్చే గింజలు
కర్షకుడు రాల్చిన
చెమట చుక్కల పంట రాశులు
కుప్ప కావలికి పోయి
కునుకు తీస్తూ
పంట గింజల మీదే
ప్రాణం వదిలె
వస్తున్న వానలకు వడ్లు తడిసిపాయే
తడిసి మొలకెత్తుతున్న
తినే పంట విత్తులు
నాగలి పట్టిన
రైతుకు నష్టమాయే
ఎవుసమంటే రైతుకు
ఎంత భారమాయె
శ్రమ పాడుతూ
చేస్తుండు సెలక
పండించిన పంటకు
గిట్టుబాటు ధర
పెట్టుబడికి బాకీ చేసి
కట్టుబడి పోతుండు
కర్షకుడు దేశాన
పైసలు ఎన్ని ఉన్నా
ప్రాణమే ముఖ్యం
ఆహారం లేకుంటే
ఆగదు ఊపిరి
కుబేరునికైనా
కూలి పేదకైనా
ఆకలి తీర్చే అన్నదాత
-దేవరపాగ కృష్ణయ్య
9963449579