నీటిమీద నేలమీద
మడుగులోన మట్టిలోన
బతుకుపోరులో బతికే తీరులో
కత్తిమీద సాములా కష్టాలను జయిస్తూ
చెప్తున్నది… కుమ్మరి పురుగు
జీవితమంటే కాదు ఆరాటం
జీవితమంటే పోరాటమని
ప్రకృతేమో ప్రతికూలం
పరిస్థితులేమో అననుకూలం
ఐనా.. పరిసరాలను పసిగట్టి
ప్రాణాలను పదిలంగా రక్షించుకునే జీవి తాబేలు
జీవేమో చిన్నది… జీవిత కాలమేమో పెద్దది
పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తే
పద్మవ్యూహాన్ని సైతం ఛేదించవచ్చునని…
బాహ్య ప్రపంచానికి బాటలు వేస్తూ
భౌమ్యావరణానికి దారులు వేస్తూ
ఉభయజీవి భువిపై ఉద్భవించెను
ఉభయచరమై ఉనికిని కొనసాగించెను
సాహసం చేయ(గా)రా డింభక(0)
సాధించెను గొ(క)ప్ప విజయం
ప్రకృతిని పరికిద్దాం
పరిశీలనతో ప్రయత్నిద్దాం
సమస్యల సమరంలో సయ్యాటను సాగిద్దాం
ఆత్మహత్య మహాపాపం
ఆత్మన్యూనత వదిలేయ్
ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకెయ్..
ఉన్నది ఒక్కటే జీవితం..
ఉజ్వల కిరణమై ప్రకాశిద్దాం
ఊపిరి ఉన్నంతవరకు బతికేద్దాం..
-మండల కాళిదాస్
91827 05382