పల్లవి: చూస్తూ ఉందామా .. చూస్తూనే ఉందామా..
మునుగోడు ప్రగతికి పునాదులు వేద్దామా..
కోవర్టు బ్రదర్సేమొ కోట్ల కమ్ముడౌతుంటే
కండ్లముందే మన భవిత కల్లోలితమౌతుంటే .. ॥ చూస్తూ ॥
చరణం 1: తరతరాల తన్లాటన అడుగడుగున వేదన..
మునుగోడు నేలన అన్ని తీర్ల పీడన..
18 వేల కోట్లకూ ఉపఎన్నిక మోసము..
మునుగోడును మార్కెట్లో అమ్ముకునే నీచము.. ॥ చూస్తూ ॥
చరణం 2: మునుగోడు నీళ్ల కొరకు ఉద్యమించే కేసీఆరు..
జనగోడును ఆలకించి కరుణించే సీఎం సారు..
ఫ్లోరైడు విషానికి విరుగుడు మన భగీరథుడు..
గరళాన్ని తాను మింగి అమృతాన్ని పంచె శివుడు.. ॥ చూస్తూ ॥
చరణం 3: దండుమైలారంలో దండుగట్టే యువ జనము..
ఉద్యోగ ఉపాధిలో మునుగోడు ఇక ఘనము..
యువనేత కేటీఆర్ అండగా కదిలిండు నేడు..
రాచకొండ చుట్టుముట్టు బంగారమే ఇగ చూడు… ॥ చూస్తూ ॥
చరణం 4: నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపే చంద్రుడు..
రైతుబంధువై యవుసం కన్నీల్లను తుడిచిండు..
కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి
టీఆర్ఎస్ను గెలిపిస్తే మునుగోడుకు సమృద్ధి… ॥ చూస్తూ ॥
చరణం 5: అందరమూ వొక్కటై కారు గుర్తుకు వోటేద్దాం
బీజేపీ కాంగ్రెస్ను పొలిమేరకు తరిమేద్దాం
మునుగోడు గడ్డ మీద మన జండానెగరేద్దాం
కేసీఆర్తో కలిసి నడిచి అభివృద్ధిని సాధిద్దాం… ॥ చూస్తూ ॥