పల్లవి: తెలంగాణ వైభవాన్ని చాటరా
సోదరా.. గళమెత్తి పాడరా
చరణం: ఎందరో వీరుల త్యాగం
మన రాష్ట్ర ఆవిర్భావం
దీక్షతో మొక్కలను నాటి
ప్రకృతిమాతకిద్దాం హరిత హారతీ
మిషన్ భగీరథ రాగా
తాగునీటి కష్టాలు తీరెగా
రైతు బంధు కర్షకులకు కానుక
కల్యాణలక్ష్మితో పెండ్లివేడుక
॥తెలంగాణ॥
చరణం: ఐటీ రంగంలో మేటి
అన్నపూర్ణ కెవరూసాటి
బతుకమ్మయై కొలువుదీరగా
మహిళలందు చైతన్యం కలిగెనా
గురుకుల పాఠశాలలె వెలిసే
విద్యాభివృద్ధియే జరిగె
చెరువులందు జలకళ మెరిసెగా
పంటలే సమృద్ధిగ పండెగా.. ॥తెలంగాణ॥
చరణం: వృద్ధులకు ఆసరా పింఛను
కంటివెలుగుతో కంటి చూపు
ఆరోగ్యలక్ష్మితో ఆరోగ్యం
వెల్లివిరిసే స్త్రీలలో ఆనందం
బంగారు తెలంగాణ కోసం
సంక్షేమ పథకాలు వేసి
మన చంద్రశేఖరుని స్ఫూర్తితో
అభ్యుదయ పథంలో సాగుదాం
మహిలో మన రాష్ట్ర ఘనతను చాటుదాం.. ॥తెలంగాణ॥
-డాక్టర్ నర్వా నారాయణరావు, 93980 49340