పోరు సలిపి వేరు పడి
ప్రాయమెంతో లేకున్నను
పుడుతూనే ప్రబలమైన
జిగితోనే ఎదిగే నేడు..!
జనత మనసు తెలిసినట్టి
నాయకుడే పాలకుడై
ప్రజలందరి బాగు కొరకు
అహరమ్ములు కృషి జేసెను…
లగ్గమంటె బుగులు
పోయె లక్ష్మితోటి
కిట్టు చేతికొచ్చినంక
దిగులు లేదు జననమన్న…
ముసలవ్వను చెల్లెమ్మను ఆదుకొనె ఆసరిచ్చి
రైతుబంధు బీమాలొచ్చి అండగుండెలే
ఆడబిడ్డ నీటిగోస భగీరథుడు దీర్చెలే
దళితుల వెలుగులకై బంధువల్లే వచ్చెలే
ఒప్పందపు నౌకరుల ఆకలి కడుపులు నిండెలే
పుడమి తల్లి పసిరికతో పచ్చగ మారేనులే!
పల్లెలు, పట్నాలన్ని అద్దమోలే మెరిసె జూడు
కాకతీయ స్ఫూర్తితోటి తటాకములు నిండె నేడు
రైతన్నను రాజు జేసె బీమా బంధు సాయమిచ్చి
గరీబోళ్ల సదువులకై గురుకులాలు వెలసె జూడు!
జాగ లొల్లిలన్ని పోయే ధరణి రాకతోని
నీటి నడత పొలం బట్టే ప్రాజెక్టులతోని
గూడులేని వెలితిబోయే డబుల్ బెడ్రూమ్లతోని..
ఎనిమిదేండ్ల తెలంగాణ ఎనభై ఏండ్ల వృద్ధి చెందె
రంది లేదు దిగులు లేదు సంబురాలే యాడ జూడ
అబ్బురంగ దేశమంత తెలంగాణ దిక్కు జూసె…
– పవన్ ఎం.ఎన్.వి. , 93967 77690