వంశ ప్రశస్తి చెప్పిన శాసనం

పూర్వపు వరంగల్లు జిల్లా ములుగు తాలూకాలోని మాచాపూర్ గ్రామ సమీపంలో కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందిన శాసనం దొరికింది. దీన్ని వేయించినవాడు కాంత మధూక వంశానికి చెందిన వెన్నపరెడ్డి. ఇతడు కాకతీయ సామంతుడు. అశ్వపాలకుడైన రేచర్ల కాటయ పాలనా కాలంలో
ఈ శాసనాన్ని వేయించాడు. శాసనకాలం శ.సం. 1139 = క్రీ.శ. 1217.శా
సన ప్రారంభంలో కాంత మధూక వంశ ప్రశస్తి, వారి వంశావళి వివరంగా చెప్పబడింది. రామిరెడ్డి తమ్ముడైన లోకిరెడ్డి బొల్లమాంబల కుమారుడు వెన్నపరెడ్డి. ఇతడి సోదరులు ఎఱ్ఱపరెడ్డి, ఎక్కరెడ్డి.
శాసనకర్త అయిన వెన్నపరెడ్డి ‘శ్రీనివాసుండు సతతంబు నధిక ధర్మాతుండగు.. సురుండును, దేవ బ్రాహ్మణ భక్తలోచనుండు, బందు నిదానుండు, పరహిత భీరుండు, సచ్చరిత్రుండు, విబుధ సంచితుండు, కనకాద్రి ధీరుండు, వనధి గంభీరుండు, రేచన విబుండు సత్యకుమారుండు, దినకర.. (యశుండు) విక్రముండు ఉభయ కులదీపకుండు, ఉత్తముడు, చతురాననుండు, అభయచిత్తుండు సద్గుణాకరుండు, శ్రీ పర్వత మల్లికార్జున భక్తి నిరతుండు..’ అని ప్రశంసించబడినాడు. ఇంకా ఈ శాసనంలో ఆ వంశానికి చెందిన ఇతరుల పేర్లు క్రమంగా చెప్పబడ్డాయి.
వెన్నపరెడ్డి తన పుత్ర, మిత్ర, కళత్ర సహితంగా పరమానందంతో భోగ, ఉపభోగాలు అనుభవిస్తూ రాజ్యం చేయుచున్నాడని చెప్పబడింది.
శ.సం.1139 ఈశ్వర సంవత్సరంలో వెన్నయపల్లి, బోడుకోడూరువరం గ్రామాలను తాను నిర్మించిన దేవాలయాల నిర్వహణకు దానమిచ్చినాడు. అదేవిధంగా వెన్నపరెడ్డి ఆ కేశవ దేవుని ధూప దీప నైవేదాల్యకు ప్రోలేశ్వర దేవునికి, ఎక్కేశ్వర దేవునికి, పాటి దేవరకు భూమిని సమర్పించినాడు. అదేవిధంగా కార్తీక, వైశాఖ మాసాల్లో జరిగే ఉత్సవాలకు, బ్రాహ్మణులకు వ్రిత్తులను సమర్పించినట్లు తెలుస్తుంది.
ఈ శాసనంలో కాకతీయ గణపతిదేవుడు, రేచర్ల కాటయ ప్రశంసించబడినారు. వెన్నపరెడ్డి కాంతా మధూక వంశం అని చెప్పబడినాడు. ఈ కాంతామధూక వంశంవారు ప్రాంతీయం గా ఉన్న రెడ్డి సామంతులుగా కాకతీయులకు ఉన్నారు. ఈ విషయం బి.ఎన్.శాస్త్రిగారి ‘రెడ్డిరాజ్య సర్వస్వంలో’ వివరంగా తెలుసుకోవచ్చు.
- డాక్టర్ భిన్నూరి మనోహరి
9347971177
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

