కాటుక దిద్దే స్థలముంటే..

ప్రభాత వర్ణాలను పులుముకున్న దేహానికి ఆచ్ఛాదనగా
నేతచీరపై సాయంసంధ్యలు జరీపోగులైనపుడు
ఒక కవితా వాక్యానికి
మనసు లయగ్రాహి ఛందంలో లాస్యం చేసినపుడు
గరిక పచ్చపై గొల్లభామలాంటి
ఏ కథామలుపునో పసిగట్టినపుడు..
పాటకో పద్యానికో కన్నీరుమున్నీరవుతున్నపుడు..
అందంగా ఉన్నాననే అనుకుంటాను!
ఒక పట్టాన అబ్బని నిర్దేశిత దేహభాష కోసం
విఫల యత్నాలు చేయనపుడు
నలుగురి నవ్వులలో మురిసి
మోము మేఘపటలమై మెరిసినపుడు
ఏమీ కానివారి వెతలకు యెద తల్లడిల్లి
విరించి రాతను ప్రశ్నించబూనినపుడు
ఎంతదాచినా కాయం
శ్రమ దాయనితనాన్ని బహిర్గతపరుస్తున్నపుడు
కలవరపడే గతాన్ని వదిలి
ఆశల కాంక్షలు తీర్చే దారులకై అడుగేస్తున్నపుడు
ఏకానేకాల మధ్య దీర్ఘాలోచనలో సతమతమవుతూ
కొన్నిటిని బాహాటంగా నిరసిస్తూ
కొన్నిటిని మౌనంగా అపేక్షించినపుడు
మరింత అందంగా ఉన్నాననే అనుకుంటాను!
నాసికాగ్రంలో చూపును చేర్చి
భ్రుకుటి మధ్యంలో తారను నిలిపినా
అంటూనే ఉంటారు..!
మేని కాంతికై మనోహర భావనలద్దుకుంటాను
నానావిధ తైలాలతో నల్లదనాన్ని ఎన్ని ఆకృతులలో అల్లనూ
పరిమళ భరిత కవితా మాలికలల్లజూస్తుంటాను
కాటుక దిద్దేంత స్థలముంటే కళ్ళనిండా
మరికొన్ని కలలే నింపుకొంటాను..!
నాకేమీ పట్టదనీ
అలంకరణపై శ్రద్ధే లేదని
అనేవాళ్లే చెప్పాలి
ఇంకెలా అలంకరించను ఈ హృదయపు పద్యాన్ని…
డాక్టర్ ,కాచాపురం . దుర్గాదేవి
78930 93495
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

