నీటి గుర్రంపై స్వారీ
పరిధులు ఎరుగని పయనం
ఆయువు తీరం చేరే లోపు
ఆన్నీ దాటేయాలి
ఉర్రూతలూగే యువత గమ్యం
కాలం వయసును తినేయకముందే
ఆ రంగుల్ని పరుచుకోవాలి
ఆహ్లాదపు దేహ సౌందర్యాన్ని
నిండా ముంచెత్తాలి
ఎలాగైనా సరే
గతాన్ని విరహ గీతాన్ని చేసి
నేటి తీరుపై పూల తివాచీ పరచి
నూతనత్వానికి ఊతమివ్వాలి
కడవరకూ సాగిపోవాలి
రాలిపోయిన వసంతపు కాంతుల్ని
ఎక్కడివక్కడే అతికించేస్తూ
కాలాన్ని చిలికి చిలికి
పరిమళాన్ని లోకంపై వెదజల్లాలి
ఎలాగైనా సరే
ఊహల గిరిపై వాలిన పిట్టలా
రెక్కలు తటపటలాడిస్తూ
కరిగే కలల వాకిట్లో బొమ్మలా
నిలబడే తీరును అరికట్టాలి
నరెద్దుల రాజారెడ్డి
96660 16636