కాలః పచతి భూతాని
కాలః సంహరతే ప్రజాః
కాలః సుప్తేషు జాగర్తి
కాలోహి దురతి క్రమః
కాలమే గతాన్ని హరించివేస్తుంది. కాలమే సమస్త జీవరాశిని సంహరిస్తుంది. సర్వజగతి నిద్రలోకి వెళ్లినా కాలం మేల్కొనే ఉంటుంది. కాలం అతిక్రమింప జాలనిది. అంటే… సమస్త చరాచర జీవకోటి నాశనమైనా, కాలం అక్షయమై ఉంటుంది. కావున కాలమహిమ చాలా గొప్పది.