బతుకమ్మ నీ ఆట ఉయ్యాలో
భాగ్యమే మా ఇంట ఉయ్యాలో
పసిడి తంగేడు పూలు ఉయ్యాలో
పడతిరా బతుకమ్మ ఉయ్యాలో
గుమ్మడి పువ్వుల్ల ఉయ్యాలో
గౌరమ్మ మాయమ్మ ఉయ్యాలో
కట్ల పువ్వల్లే వున్న ఉయ్యాలో
కరీంనగర్ జిల్లా ఉయ్యాలో
పల్లె పల్లె లోన ఉయ్యాలో
బతుకమ్మ ఆటలు ఉయ్యాలో
పెద్దోళ్ళు ఆడిరే ఉయ్యాలో
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో
మంచి మనసులున్న ఉయ్యాలో
మా ఊరు చూడు ఉయ్యాలో
కళ్లాపి జల్లిన ఉయ్యాలో
ముగ్గులు పెట్టిన ఉయ్యాలో
ముగ్గుల రంగుల్లు ఉయ్యాలో
తీరొక్క పువ్వులు ఉయ్యాలో
రచ్చబండ కాడ ఉయ్యాలో
అందరూ కలువంగా ఉయ్యాలో
ఊరి మేలు కోరే ఉయ్యాలో
సర్పంచ్ చల్లంగా ఉయ్యాలో
నీతి ధర్మమున్న ఉయ్యాలో
చిన్న పెద్దలంతా ఉయ్యాలో
చీకు చింత లేని ఉయ్యాలో
చక్కని హృదయాలు ఉయ్యాలో
ప్రజల బాగు కోరి ఉయ్యాలో
పనులే చెయ్యాలే ఉయ్యాలో
పదిమందితో మనము ఉయ్యాలో
ప్రేమగా ఉండాలే ఉయ్యాలో
మంచి మంచి పనులు ఉయ్యాలో
మానవులు చేయంగా ఉయ్యాలో
మహిలోన ఇంకేమీ ఉయ్యాలో
మాధవుని సేవయే ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలోబొమ్మిదేని
-రాజేశ్వరి
9052744215