కూరగాయల కుప్పను ముందు పోసుకొని
తెలంగాణను సరిచేసినట్టు
సంసారాన్ని సరిచేస్తూ
కూరగాయలు సర్దుతుంది ఆ తల్లీ
తెలంగాణను నిజాయితీగా తెచ్చుకున్నట్టు
కిలో, అరకిలో, పావుకిలో చొప్పున
ఆ తల్లి కూరగాయలు నిజాయితీగా అమ్ముతూ
పిల్లల బతుకుకు బాటలేసే
రాగం అందుకుంటుంది
తెలంగాణ వచ్చాక
అందరి అవసరాలు తీర్చుకున్నట్టు
ఆకలి తీర్చే యజ్ఞం చేస్తుంది
తెలంగాణ పథకాలలా
మొగ్గే ఇస్తుంది కానీ
చెడిపోయినవి, వాడిపోయినవి
జీవితంలో పనికిరాని విషయాలను
ఏరేసినట్టు ఏరేస్తుంది
తెలంగాణ భవిష్యత్తు ఎండపాలు
కాకుండా చూస్తున్నట్టు
పిల్లల భవిష్యత్తు కాస్తుంది
తెలంగాణతనంలా
అమ్మతనం నిండుతనమై
ఉట్టిపడుతుంది
– గూడెల్లి ఇస్తారి 98499 83874