ఆ.వె.. కష్టములుదెలిసిన ఘనుడైన కే.సి.ఆర్.
పేద గర్భిణిలకు బాధ తీర్చ
అమ్మ యొడి యనెడి యద్భుత కిట్టునే
నమలు జేసె ప్రజకు నండ నుండ
సీ…రెండ్వేల పదహారు నుండి మొదలిడెను
నలుబదియొకవాహనముల తోడ
ప్రారంభమును జేసె పల్లెప్రజ కొఱకు
రెండు వందలు మలి విడుతలోన
వాహనమ్ములగూర్చె వనితల మేలుకై
వందనాలుగు సంఖ్య వత్తగానె
పది సీట్లను గలిగి పడుకొను వీలున్న
వాహనంబు నెంతొ వడిగ వచ్చు
ఆ.వె…ఆపదేమి లేక యమ్మవొడియనుచు
ఆసుపత్రిలోన నగును కాన్పు
తల్లి బిడ్డలకును దగురీతి వైద్యము
సరియగు సమయాన జరిగి తీరు
ఆ.వె…ప్రజలకండ నుండు పథకాలనెన్నియో
అమలు జేసెనెన్నొ నార్తి బాప
ముఖ్యమంత్రి గారు మూర్తిత్రయము సాటి
వసుధ లోన మనకు వన్నె తెచ్చె
-బొమ్ము విమల
తెలుగు భాషోపాధ్యాయిని
జి.ప.ఉ.పా.హైతాబాద్
షాబాద్… మండలం.
రంగారెడ్డి…జిల్లా*
చరవాణి…9989775161
Address
Bommu Vimala,
H.no.13-32/1,
Yadava nagar,
Malkajgiri,
Medical -malkajgiri, district,