అంతరంగ లోతుల్ని
తడుముతూ
మనసులోని భావాల్ని
పెదవి దాటని మాటల్ని
మౌనంగానే పలకరిస్తూ
అక్షరాలై జాలువారుతాయి
అహరహం తపించే కలం నుంచి
అనంత జ్ఞానాన్ని అన్వేషిస్తూ
ఆనందాన్ని కలబోసుకొని
తన్మయత్వంతో కవితాక్షరాలై
అలవోకగా చేజారి
నెత్తావులను హత్తుకొని
సృజన లోకపు దారి చూపుతాయి
జీవిత తొలిమెట్టుపై
అడుగిడిన సమయాన
లోకానుభవాల్ని నేర్పుతూ
ఓర్పును ఒద్దికగా అద్ది
సవాళ్లను అధిగమించే
ఆత్మవిశ్వాసకు ఆయుధాన్ని
అందించే జీవనాక్షరాలై
అక్షర రూపమెత్తిన అమ్మలా
అక్కున చేర్చుకొని
జీవనోత్సాహాన్నిస్తూ
కొన్ని చరిత్రలై ఎన్నెన్నో
గాథలై
అజేయమవుతాయి