ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం
మంత్ర మౌషధ సంగమం
దాన మాన అవమానాని
నవ గోప్యాని కారయేత్
జిహ్వకో రుచి, పుఱ్ఱెకో గుణం.. అనేది తెలుగులో ప్రసిద్ధి చెందిన సూక్తి. కొందరు తమకు తెలిసిన అన్ని విషయాలను అందరికి చెప్పే వారైతే, ఇంక కొందరు అన్ని విషయాలను తనలోనే ఉంచుకొని మౌనంగ, గంభీరంగ ఉంటారు. అట్లుకాక విచక్షణతో చెప్పవలసినవి చెబుతూ చెప్పకూడనివి తనలోనే దాచుకోవడం మంచి పద్ధతి. చెప్పకూడని వాటిలో తొమ్మిదింటిని చేర్చినారు. 1.ఆయుష్య, 2. ధనం, 3.గృహ చ్ఛిద్రాలు, 4.గురువు ఉపదేశించిన మంత్రం, 5.ఔషధము(పూర్వం ఆయుర్వేద వైద్యులు అందుబాటులో ఉన్న ఆకో, అలమో మందుగా ఇచ్చేవారు. దానిమీద చులకన భావమేర్పడి, మందు ప్రభావం ఉండకపోయే ప్రమాదముంటుంది), 6.దాంపత్య సుఖానుభవ విశేషాలు, 7.దానము, 8.తనకు జరిగిన సన్మానం, 9.అవమానం.. ఇవన్నీ దాచుకోవలసినవి.
టి.సుధాకరశర్మ