ఇప్పుడు లైఫ్‌ైస్టెల్ వీడియోలకు విపరీతమైన క్రేజ్. నిత్యజీవితంలో భాగమైన సంగతులనే విడమరచి చెబుతూ.. వీడియోలు కట్ చేస్తున్నారు యూట్యూబర్లు. ఆ ముచ్చట్లు జనానికి నచ్చడంతో అదో ట్రెండ్‌గా మారుతున్నది. ‘మామ్ అండ్ మీ టాక్స్’ ఛానెల్ ద్వారా ఆ తరహా లైఫ్‌ైస్టెల్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హైదరాబాద్‌కు చెందిన సంధ్య. గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేశారామె. కవల పిల్లలు కడుపులో పడటంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ గడుగ్గాయిలను చూసుకోవడానికి ఇంటికే పరిమితం అయ్యారు. కాలక్షేపానికి కన్నతల్లితో కలిసి ‘మామ్ అండ్ మీ టాక్స్’ అనే ఛానెల్ ప్రారంభించారు. ఇందులో వంటలు, మొక్కల పెంపకం, బ్యూటీ టిప్స్, ఫిట్నెస్.. ఇలా దైనందిన జీవి
తానికి సంబంధించిన వివిధ అంశాలపై విలువైన సూచనలు చేస్తూ అందరి మనసులనూ గెలుచుకుంటున్నారు. అంతేకాదు.. బంగారం కొనుగోలు, నాణ్యత, మార్కెట్లో వివిధ గోల్డ్ స్కీముల గురించి విశ్లేషించే వీడియోలు సంధ్యను ఫేమస్ చేశాయి. తను హాజరయ్యే వేడుకలకు సంబంధించిన వీడియోలు కూడా నలుగురితో పంచుకుంటూ వీక్షకులకు ఆత్మీయ నేస్తంగా మారారు సంధ్య. ఆ బంధం ఇంకా బలపడుతున్నది.