HomeLifestyleWrinkles On The Face And Circles Under The Eyes That Come With Age Take Away From The Beauty
వలయాలను వెచ్చగా తరిమేద్దాం
వయసు పెరిగే కొద్దీ వచ్చే ముఖంపై ముడతలు, కండ్ల కింద వలయాలు వచ్చి అందాన్ని దూరం చేస్తాయి. ఈ ముడతలను, ఆ వలయాలను గోరువెచ్చని నీళ్లు తరిమికొడతాయి.
వయసు పెరిగే కొద్దీ వచ్చే ముఖంపై ముడతలు, కండ్ల కింద వలయాలు వచ్చి అందాన్ని దూరం చేస్తాయి. ఈ ముడతలను, ఆ వలయాలను గోరువెచ్చని నీళ్లు తరిమికొడతాయి.
వెడల్పాటి గిన్నెలో గోరువెచ్చని నీళ్లు పోసి.. అందులో 20 సెకండ్లపాటు ముఖాన్ని ఉంచండి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే, పదేసి సెకండ్ల చొప్పున రెండు, మూడుసార్లు ముఖం అంతా మునిగేలా తలను నీళ్లలో ఉంచాలి. తర్వాత మెత్తటి వస్త్రంతో ముఖాన్ని తుడుచుకోవాలి.
గోరువెచ్చని నీళ్లతో ముఖం కడగడం వల్ల చర్మం తాజాగా మారి ముడతలు తగ్గుముఖం పడతాయి. మొటిమలు, మచ్చలు కూడాతగ్గతాయి. రక్తప్రసరణ మెరుగై చర్మం మెరుస్తుంది.
గోరువెచ్చని నీళ్లు చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తాయి. దుమ్ము, ధూళి, మేకప్ వల్ల మూసుకుపోయిన స్వేదరంధ్రాలను తెరుస్తాయి. ఫలితంగా చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.