కాలికి దెబ్బలు తగలకుండా రక్షణగా ఉండే బూట్లు ధరిస్తారు. ఫ్యాషనబుల్‌గా రకరకాల షూ వేసుకుంటారు. కారణం ఏదైనా పొద్దంతా బూట్లు ధరించి ఉండటం మంచిది కాదన్నది వైద్యుల మాట. బూట్లు వేసుకున్నప్పుడు పాదం ఒకే భంగిమలో ఉంటుంది. దీనివల్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడుతుంది. వాటి కదలికలపై నియంత్రణ ఏర్పడుతుంది.
ఇది కీళ్ల అమరికపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రక్త ప్రసరణ సమస్యలు వస్తాయి. మనదేశ వాతావరణంలో చెమట ఎక్కువగా పడుతుంది. అలాంటప్పుడు ఎక్కువ సమయం షూస్ ధరించడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉంది. అందుకే, అవసరం మేరకే షూ ధరించడం మంచిదని సలహా ఇస్తున్నారు.