వెటరన్ నటి శిల్పాశెట్టి ఫిట్నెస్ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటుంది. ప్రతి ఉదయం యోగాసనాలు, వర్కవుట్లు ఆమె దినచర్యలో భాగం. తన కసరత్తులను వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటుంది కూడా! పొత్తికడుపు కండరాలకు సంబంధించిన వర్కవుట్ల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
వ్యాయామ మెలకువలతోపాటు ఆహార నియమాల గురించి అందులో చెప్పుకొచ్చింది. తుంటి ఎముక దృఢంగా తయారవ్వడానికి ‘రష్యన్ ట్విస్ట్స్’ వర్కవుట్ చేసే విధానాన్ని కూడా ఆ వీడియోలో పొందుపరిచింది శిల్ప. తరచూ ఇలా రకరకాల కసరత్తులు షేర్ చేస్తూ తన ఇన్‌స్టా అకౌంట్ ఫాలోవర్స్‌కు వ్యాయామ గురువుగా ఆదరణ పొందుతున్నది.