సచిత్ర విహారం
ప్రతి ఫొటోకూ.. తనదైన ప్రత్యేక శైలి ఉంటుంది. వైల్డ్ లైఫ్, ల్యాండ్‌స్కేప్, స్ట్రీట్, పోర్ట్రెయిట్.. ఇలా ఫొటోగ్రఫీలో ఎన్నెన్నో రకాలు ఉంటాయి. అయితే, ట్రావెల్ ఫొటోగ్రఫీ ఇందుకు భిన్నమైనది. ఇది అన్నిరకాల ఫొటోగ్రఫీ శైలుల మిశ్రమం. ఫొటోగ్రాఫర్-వీక్షకుడు.. ఇద్దరికీ తెలియని ప్రదేశం భావాన్ని తెలియజేయడమే దీని లక్ష్యం.
ప్రతి ఫొటోకూ.. తనదైన ప్రత్యేక శైలి ఉంటుంది. వైల్డ్ లైఫ్, ల్యాండ్‌స్కేప్, స్ట్రీట్, పోర్ట్రెయిట్.. ఇలా ఫొటోగ్రఫీలో ఎన్నెన్నో రకాలు ఉంటాయి. అయితే, ట్రావెల్ ఫొటోగ్రఫీ ఇందుకు భిన్నమైనది. ఇది అన్నిరకాల ఫొటోగ్రఫీ శైలుల మిశ్రమం. ఫొటోగ్రాఫర్-వీక్షకుడు.. ఇద్దరికీ తెలియని ప్రదేశం భావాన్ని తెలియజేయడమే దీని లక్ష్యం.
ట్రావెల్ ఫొటోగ్రఫీ అనేది.. మీరు సందర్శించే ప్రదేశం, అక్కడి సంస్కృతి, ప్రకృతి, స్థానిక జీవనశైలి, వారి భావోద్వేగాలను కెమెరా ద్వారా ఒక స్టోరీలా చూపించడం. ఇది కేవలం దృశ్యం మాత్రమే కాదు.. అది ఒక అనుభవం, ఒక జ్ఞాపకం, ఒక కథ. మీ చేతిలోని డీఎస్ఎల్ఆర్ కెమెరా.. మీ ప్రయాణంలోని ప్రతి క్షణాన్నీ శాశ్వతంగా నిలిపే ఓ స్నేహితుడు కూడా!

డీఎస్ఎల్ఆర్ ఎందుకు?
- హై క్వాలిటీ ఫొటోలు: పోస్ట్ ప్రాసెసింగ్‌కు, పెద్ద ప్రింట్స్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయి.
- మాన్యువల్ కంట్రోల్: అపర్చర్, షట్టర్ స్పీడ్, ఐఎస్వోపై ఫొటోగ్రాఫర్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది.
- లెన్స్ మార్పు సౌకర్యం: విభిన్న దృశ్యాల కోసం విభిన్న లెన్స్‌ను వాడుకునే వెసులుబాటు కలుగుతుంది.
- RAW ఫార్మాట్ సపోర్ట్: పోస్ట్ ప్రొడక్షన్లో ఫొటోలను సులభంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు.
అవసరమైన పరికరాలు
కెమెరా:
- కెనాన్ ఈఓఎస్ 90డీ/ నికాన్ డీ7500/ సోనీ ఏ7సీ మొదలైనవి.
- 24 ఎంపీ అంతకన్నా ఎక్కువ రిజల్యూషన్ ఉన్న కెమెరాలు బాగుంటాయి.
- కెమెరా బాడీ బరువు తక్కువ ఉండేలా చూసుకోవాలి. వెదర్ సీలింగ్ కెమెరాలు మరింత మంచిది.
లెన్స్
- వైడ్ యాంగిల్ (16-35 ఎంఎం): ప్రకృతి దృశ్యాలు, ఆర్కిటెక్చర్ కోసం..
- స్టాండర్డ్ జూమ్ (24-70ఎంఎం): నగర వీధులు, పోర్ట్రెయిట్ ఫొటోలు బాగా వస్తాయి.
- టెలీఫొటో (70-200ఎంఎం): దూరంలో ఉండే దృశ్యాలను బంధించడానికి, క్యాండిడ్ మూమెంట్స్ కోసం..
- ప్రైమ్ లెన్స్ (35ఎంఎం / 50ఎంఎం f/1.8): తేలికైన, స్పష్టమైన లో లైట్ ఫొటోలు తీయడానికి..
ఇతర పరికరాలు
- ట్రైపాడ్: లాంగ్ ఎక్స్పోజర్, నైట్ ఫొటోగ్రఫీ కోసం..
- పోలరైజింగ్ ఫిల్టర్: ఆకాశం, నీటి ప్రతిబింబాలను మరింత మెరుగ్గా చూపించడానికి
- ఎన్డీ ఫిల్టర్: జలపాతాలు, స్లో మోషన్ ఎఫెక్ట్ కోసం..
- లెన్స్ క్లీనింగ్ కిట్: ట్రావెల్ ఫొటోగ్రఫీలో కెమెరా, లెన్స్‌పై దుమ్మూ, ధూళి పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, క్లీనింగ్ కిట్ వెంట ఉండటం మంచిది. అదనపు బ్యాటరీలు, ఎస్డీ కార్డులు
కంపోజిషన్ చిట్కాలు
- రూల్ ఆఫ్ థర్డ్స్: ప్రధాన అంశాన్ని ఫ్రేమ్‌లో 1/3 వద్ద ఉంచండి
- లీడింగ్ లైన్స్: రోడ్లు, నదులు, వంతెనలు.. వీక్షకులను ప్రధాన సబ్జెక్ట్‌వైపు లాక్కెళ్తాయి.
- ఫోర్‌గ్రౌండ్: ప్రధాన సబ్జెక్ట్‌తోపాటు వెనకాల పూలు, రాళ్లు, వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఫొటోకు మరింత డెప్త్ వస్తుంది.
- ఫ్రేమింగ్: తలుపులు, కిటికీలు, చెట్లను ఉపయోగించి ప్రధాన సబ్జెక్ట్‌ను ఫ్రేమ్ చేయండి.
- సిమెట్రి: ఆర్కిటెక్చర్లో బ్యాలెన్స్ కోసం..
- రిఫ్లెక్షన్స్: నీటిలోని ప్రతిబింబాలను ఫొటోలుగా తీస్తే.. మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
లైటింగ్
- గోల్డెన్ అవర్ (ఉదయం/ సాయత్రం): ఈ సమయంలో వాతావరణం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. నీడలు కూడా తక్కువగా పడుతుంటాయి.
- బ్లూ అవర్స్ (సాయంత్రం తర్వాత): వీధి దీపాల వెలుగులో జిగేల్మనే నగర వీధులు.. ఈ సమయంలో మరింత అద్భుతంగా కనిపిస్తాయి.
- మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా పడే నీడలు.. ఫొటోలను దెబ్బతీస్తాయి.
కథ చెప్పండి..
ప్రయాణాల సందర్భంగా స్థానిక ప్రజలు, అక్కడి ఆహారం, సంస్కృతి, మార్కెట్లు, నిర్మాణాలు.. వీటిన్నిటినీ ఫొటోలుగా మలుస్తూ, ఆ ప్రదేశానికి సొంతమైన కథను చెప్పండి. ప్రతి ఫొటోలో తనదైన భావన, వాతావరణం, కథ ఉండేలా చూసుకోండి. చివరిగా.. ట్రావెల్ ఫొటోగ్రఫీలో మీరు తీసిన ఫొటోలు.. ఆయా ప్రదేశాల గురించి మాత్రమే కాకుండా, మీ ప్రయాణాన్ని కూడా చెబుతాయి. సరైన పరికరాలు, సెట్టింగులు, ప్రత్యేక దృష్టితో.. ఈ ప్రపంచాన్నే ఒక కథల పుస్తకంగా మార్చవచ్చు. మీరు చూసిన దానికంటే ఎక్కువగా అనుభవించిన దాన్ని ఫొటోల రూపంలో చూపించవచ్చు. ఆ ప్రతి ఫొటోలో ఓ సందర్భం, తనదైన భావం, కథ ఉండాలి. గమనించడం-అనుభవించడం-ఫొటోలు మలచడం.. ఇదే ట్రావెల్ ఫొటోగ్రఫీ మంత్రం.
…? ఆడెపు హరికృష్ణ
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

