Alzheimers : వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?
Alzheimers : వృద్ధాప్యం వచ్చిందంటే వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మతిమరుపు గురించి. ఏది ఎక్కడ పెట్టారనే మరిచిపోయి ఇబ్బంది పడుతుంటారు. వృద్ధుల్లో మతిమరుపు ...

(Alzheimers) వృద్ధాప్యం వచ్చిందంటే వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మతిమరుపు గురించి. ఏది ఎక్కడ పెట్టారనే మరిచిపోయి ఇబ్బంది పడుతుంటారు. వృద్ధుల్లో మతిమరుపు సమస్యపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఏటా ఇదే రోజున వరల్డ్ అల్జీమర్స్ దినం జరుపుకుంటాం. డాక్టర్ అలోయిస్ అల్జీమర్స్ అనే వైద్యుడు ఈ వ్యాధిని 1906 లో ప్రపంచానికి తెలియజేశారు. మానసిక అరోగ్య సమస్యతో బాధపడుతున్న మహిళ మెదడులోని కణాల్లో మార్పులను గుర్తించిన డాక్టర్ అల్జీమర్స్.. దీని ద్వారా మతిమరుపు సమస్య వస్తుందని చాటిచెప్పారు.
అల్జీమర్స్ సాధారణంగా 60 ఏండ్ల వయసు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది. చాలా తక్కువ సందర్భాల్లో 30 లేదా 40 సంవత్సరాల వయస్సులో కూడా కనిపిస్తుంది. అల్జీమర్స్ లక్షణాలు పురుషుల్లో 60 ఏండ్లకు మొదలవుతుండగా, మహిళల్లో 45 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతాయి. ఈ వ్యాధి బారిన పడిన రోగి మెదడులో ఎక్కువ భాగం దెబ్బతినడం కాలక్రమేణా మొదలవుతుంది. దాంతో వృద్ధులకు ఏమీ గుర్తుండకుండా చేస్తుంది. భారతదేశంలో 2 కోట్లకు పైగా వృద్ధులు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు.
ఈ సమస్య మొదలవగానే మెదడులోని నరాల కణాల మధ్య కనెక్షన్లు బలహీనమవుతాయి. దాంతో వ్యక్తి కూడా ఆలోచించడం మానేసి, రోజువారీ కార్యకలాపాలు చేయడంలో ఇబ్బంది పడటం ప్రారంభిస్తాడు. అల్జీమర్స్.. చిత్తవైకల్యం రూపం. దీనితో బాధపడుతున్న వ్యక్తులు మర్చిపోవడం అలవాటు చేసుకుంటారు. ఫలితంగా నిమిషం క్రితం ఏమి జరిగిందో కూడా మర్చిపోతుంటారు. ఇలాంటి వారి పట్ల కుటుంబసభ్యులు ఆదరణ చూపాల్సిన అవసరం ఉన్నది. మన కోపాన్ని వారిపై చూపి వారిని మరింత ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. వారిపై మాటిమాటికి విసుగుచెందకుండా ఉండాలి. వారి నిత్యావసరాలను దగ్గరుండి చూస్తూ వారు వినియోగించే వస్తువులు, మందులు అన్నీ ఒకేచోట ఉండేలా చూడటం వల్ల వృద్ధులు ఇబ్బంది పడకుండా చూడొచ్చు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ అంతర్జాతీయ శాంతి దినం
2008 : గోదావరి బేసిన్లో నూనె ఉత్పత్తిని ప్రారంభించిన రిలయన్స్ సంస్థ
1996 : డిఫెన్స్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్‌పై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్
1991 : సోవియట్ యూనియన్ నుంచి విడివడి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న ఆర్మేనియా
1984 : ఐక్యరాజ్య సమితిలో చేరిన బ్రూనే
1961 : తొలిసారి విజయవంతంగా ఎగిరిన అమెరికా తయారుచేసిన బోయింగ్ విమానం సీహెచ్-47 చిన్కుక్
1949 : భారతదేశంలో చేరిన మణిపూర్
1784 : అమెరికాలో తొలి దినపత్రిక పెన్సిల్వేనియా పాకెట్, జనరల్ అడ్వర్టైజర్ ప్రారంభం
ఇవి కూడా చదవండి..
ఛార్జ్‌ల ద్వారా 170 కోట్లు సంపాదించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
చేనేత, వృత్తి కళాకారులకు అండగా జీఈఎం పోర్టల్
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

