నిజంగా స్వర్గనరకాలు ఉంటే.. స్వర్గంలో దేవకాంతలే కనుక నివసిస్తుంటే.. వాళ్లు తప్పక చేనేతలే ధరిస్తుంటారు.
కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలిచినట్ట్టు.. నేత చీరలకు ‘ఏంజెల్స్ ఓన్ శారీస్’గా అధికార ముద్ర వేయాల్సిందే. అందులోనూ చందేరీ మరింత ప్రత్యేకం. ఈ వస్త్ర సంప్రదాయం మధ్యప్రదేశ్లోని చందేరిలో పుట్టింది. అలా, ఊరిపేరే చీర పేరూ అయ్యింది. తరాలనాటి అచ్చులతో.. అందమైన డిజైన్లకు ప్రాణం పోస్తారు స్థానిక కళాకారులు.