ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో.. జుట్టు రాలడం ఒకటి. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యతతోపాటు మాడుకు రక్త ప్రసరణ తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని యోగాసనాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. తల భాగానికి రక్త ప్రసరణను పెంచి, వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేసే యోగాసనాలను వివరిస్తున్నారు.