Tea History | మేలు జాతి గుర్రాల కోసం టిబెటన్లకు చాయ్‌పత్తాను ఎరగా వేసిన చైనా
Tea History | ఇరుగుపొరుగు ఇచ్చిపుచ్చుకునే వాటిలో టీ పొడి తప్పకుండా ఉంటుంది. అరకప్పు తేయాకు పొడికి, మూడు కప్పుల చక్కెర సాధించగలగడాన్ని ప్రజ్ఞగా భావించేవాళ్లు ఒకప్పుడు. కొన్ని శతాబ్దాల కిందట ఇదే చాయ్‌పత్తా ఎర చూపి జాతి గుర్రాలను వస్తు మార్పిడి కింద తెచ్చుకున్న వైనం ఒకటి ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు.
Tea History | ఇరుగుపొరుగు ఇచ్చిపుచ్చుకునే వాటిలో టీ పొడి తప్పకుండా ఉంటుంది. అరకప్పు తేయాకు పొడికి, మూడు కప్పుల చక్కెర సాధించగలగడాన్ని ప్రజ్ఞగా భావించేవాళ్లు ఒకప్పుడు. కొన్ని శతాబ్దాల కిందట ఇదే చాయ్‌పత్తా ఎర చూపి జాతి గుర్రాలను వస్తు మార్పిడి కింద తెచ్చుకున్న వైనం ఒకటి ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. టిబెట్ తమ దేశంలో అంతర్భాగమే అని చెప్పుకొనే చైనా శతాబ్దాల కిందట అక్కడివారితో వాణిజ్య సంబంధాలు పతాకస్థాయిలో నెరపడం విశేషం!
టీ పొడితోపాటు పట్టు, పింగాణీ పాత్రలు, ఇతర వస్తువుల ఎగుమతి కోసం ఒక వాణిజ్య మార్గాన్ని ఏర్పాటుచేసింది. నైరుతి చైనాలోని యునాన్ నుంచి టిబెట్‌లోని లాసా వరకూ ఉన్న ఈ దారి గుండా టిబెట్‌తో ఎగుమతి దిగుమతి వ్యవహారాలు నెరిపారు చైనీయులు. మంగోలియన్లను సమర్థంగా ఎదుర్కోవడానికి చైనాకు మేలుజాతి గుర్రాలు అవసరం ఏర్పడింది. అలాంటి అశ్వాలు టిబెట్ పీఠభూమిలోనే ఉండేవి. ఇంకేముంది వాటికోసం తమ దేశంలో విరివిగా పండే తేయాకును ఎగుమతి చేస్తామని టిబెటన్ల ముందు ప్రతిపాదన ఉంచింది చైనా. నాణ్యమైన తేయాకు కోసం అశ్వాలను ఇవ్వడానికి టిబెటన్లూ సిద్ధపడ్డారు. ఈ ఒప్పందంలో భాగంగా 7,500 టన్నుల చాయ్పత్తకు గానూ 10వేల గుర్రాలు సమర్పించుకున్నారట. ఆ తర్వాత కూడా కొన్ని శతాబ్దాలపాటు వేర్వేరు రూపాల్లో ఈ వస్తుమార్పిడి దిగ్విజయంగా కొనసాగింది. కాలక్రమంలో ఈ మార్గం టీ-హార్స్ రోడ్డుగా చరిత్రలో నిలిచిపోయింది. ఇదే దారి నేపాల్, భారత్, మధ్య ఆసియా మీదుగా యూరప్ వరకూ కొనసాగింది. ‘ద సిల్క్ రోడ్’గా పిలిచే ఈ మార్గాన్ని తూర్పు, పశ్చిమాలను కలిపే వారధిగా భావిస్తారు.
బటర్ చాయ్
కావాల్సినవి: పాలు: ఒక కప్పు, నీళ్లు: పావు కప్పు, టీ పొడి: ఒక టీ స్పూన్, చక్కెర: ఒక టేబుల్ స్పూన్, వెన్న: ఒక టీ స్పూన్, వంట సోడా: పావు టీస్పూన్.
తయారీ: ముందుగా గిన్నెలో పాలు, నీళ్లు పోసి మరిగించాలి. పాలు కాస్త వేడెక్కాక వంట సోడా వేయాలి (పాలు లేత గులాబి రంగులోకి వస్తాయి). తర్వాత టీ పొడి వేసి రెండు నిమిషాలు మరిగించాలి. టీని గ్లాస్‌లోకి వడగట్టుకొని, చివరగా వెన్న వేసుకోవాలి. టిబెట్‌వాసులు ఇష్టంగా తీసుకునే బటర్ చాయ్ సిద్ధం!
‘టీ’కా తాత్పర్యం
స్వర్గానికి వెళ్లే దారి.. తేనీటి పాత్ర మీదుగా సాగిపోతుంది.
– టిబెట్ నానుడి
Read More :
“Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు”
“Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !”
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

