ఈ రోజుల్లో పదిమందిని పలకరిస్తే.. ఎనిమిది మంది మూడ్ బాగోలేదు బాస్ అనే సమాధానం ఇస్తున్నారు. కారణం.. లైఫ్ స్టయిల్ ఒకటైతే, సెల్‌ఫోన్ మరొకటి. మనం చిల్ అవుట్ కాకుండా.. ప్రధానంగా అడ్డంకి పడుతున్నవి ఇవే! ఈ రెండు సలహాలు పాటించి చూడండి.. కొంతలో కొంతైనా మూడ్ ఆన్ అవుతుంది.
సమస్య: యాంత్రికంగా సాగిపోతున్న లైఫ్‌లో బాగా మిస్ అయ్యేది.. సన్‌లైట్. ఎందుకంటే.. పని ఒత్తిడిలో సతమతమయ్యే చాలామంది ఎండ కన్నెరగనంతగా బిజీ అయిపోతున్నారు. నిత్యం ఏసీల్లో మగ్గిపోతున్నారు. పగలు కూడా ఎల్ఈడీ కాంతుల్లోనే గడిపేస్తున్నారు. ఇవన్నీ డిప్రెషన్‌కి దారి తీస్తున్నాయి.
పరిష్కారం: రోజులో కాసేపైనా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయితే డ్రిపెషన్ నుంచి బయటపడొచ్చని జర్నల్ ఆఫ్ ఎఫెక్టీవ్ డిసార్డర్స్ నివేదిక తెలియజేసింది. ఉదయాన్నే.. డాబా పైకి వెళ్లి ఒక అరగంట సూర్యరశ్మిలో గడపాలి. దీంతో మూడ్ అంతా సెట్ అవుతుంది. డాబా పైకి వెళ్లేంత తీరిక లేదంటే.. ఇంట్లోనే సూర్య కిరణాలు పడే చోట కూర్చోండి.
షరతులు: సూర్యరశ్మి కోసం బయటికి వెళ్లినప్పుడు.. టోపీ పెట్టుకోవడం, గొడుగు పట్టుకోవడం లాంటివి చేయొద్దు.
సమస్య: సెల్‌ఫోన్ మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. నిద్ర వేళలు మినహాయిస్తే నిరంతరం సెల్లోనే ఉంటున్నారు చాలామంది. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సమయాన్ని వృథా చేస్తుంది.
పరిష్కారం: సెల్‌ఫోన్‌ను పక్కన పెట్టేయడమే సొల్యూషన్. బలవంతంగా అవాయిడ్ చేయడానికి ఇంట్లో ఫోన్ పెట్టేసి.. ఓ అరగంట బయట వాకింగ్ చేయండి. ఈ చిన్న నడక ఎండార్ఫిన్స్‌ను పెంచి మెదడును రీసెట్ చేస్తుంది. శారీరక శ్రమ మూడ్‌ను మెరుగుపరుస్తుంది.
షరతులు: తినేటప్పుడు ఫోన్ చూడొద్దు. పడుకోవడానికి మంచం ఎక్కడానికి ముందే.. మీ ఫోన్ గూట్లో విశ్రాంతి తీసుకోవాలి.